Archive for April, 2016

బ్రతుకెమన్నా మనకు పరిచిన తివాచీ?

April 16, 2016

బ్రతుకెమన్నా మనకు పరిచిన తివాచీ?

పొద్దున్నె లెవడానికి పెట్టకు పేచీ! అదుగో కొట్టింది తలుపు లచ్చి..

మళ్ళీ మళ్ళీ మోగిందీ అలారం తొ వాచి

రామాయణ మహా భారతాల్లొ కూడ ఒక పేజి

బ్రతుకు పుస్తకం లొ ప్రతి రోజు ఒక పేచీ!

 

లేవగానె వుంటుందా నోరు శుచి అజీర్తి వుంటే ఆ రోజంత అరుచి

రాత్రి జిహ్వ చాపల్యనికి పొద్ద్దున్నె ఎం లాభం వగచి !

తగదురా నిద్ర తొ లాలుచి, లేట్ నైట్ “లైక్స్” తోనె వచ్చిందీ ఈ పేచి,

బువ్వ పెట్టవు ఈ ఫెస్ బుక్, ట్టిట్టర్ల పిచ్చి!!

గూడు వెచ్చదనం లొ గువ్వతొ ఆదమరిచి, గువ్వ పిల్లల అక్కున చేర్చి, కళ్ళు చెమర్చి…

ఉద్యుక్తుడవ్వవో కదనానికి సవ్య సాచి!

Advertisements